హిమాచల్ ప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతమైన సిమ్లాలో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా బాధితురాలు సోమవారం హెల్ప్‌లైన్‌ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సిమ్లాలోని మాల్‌రోడ్డులో బాధితురాలు నడుచుకుంటూ వస్తుండగా ఓ కారు వచ్చి ఆగింది. అనంతరం ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. తర్వాత కారులోనే ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

No votes yet.
Please wait...