ఈ మధ్యకాలంలో ప్రేమికులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల ప్రేమికులపై దాడి ఘటనలు చాలానే వెలుగుచూశాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంటపై నలుగురు యువకులు దాడిచేసి.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన బుధవారం మైసూరులో జరిగింది. హెచ్‌డీ.కోటె హ్యాండ్‌ పోస్ట్‌ ప్రాంతానికి చెందిన శివసిద్ధు, అతని ప్రియురాలు కలిసి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో మైసూరు సమీపంలో ఉన్న లింగాంబుధి చెరువు వద్ద ఉన్నారు. ఇంతలో నలుగురు యువకులు అక్కడికి వచ్చారు.

ఈ క్రమంలో శివసిద్ధుపై దాడి చేసి యువతిని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి.. ఆమెపై లైంగిక దాడి జరిపారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. తీవ్రగాయాలతో శివసిద్ధు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇంతలో యువతి అతన్ని లేపి కొంతమంది వ్యక్తుల సహాయంతో ఆసుపత్రికి తరలించింది. దుండగుల దాడిలో శివసిద్ధు చేయి, కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. యువతి ప్రాణాపాయంనుంచి తప్పించుకుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కాగా రెండునెలల కిందట గుంటూరు, ఏలూరు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్నాయి.

No votes yet.
Please wait...