బాల్యవివాహాలు అడ్డుకోవడం కోసం రాజస్థాన్ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి వివాహ ఆహ్వాన పత్రికలలో ఖచ్చితంగా వధూవరుల  పుట్టిన తేదీలను జతపర్చాలని ఆదేశాలు జారిచేశారు. బాల్యవివాహాలపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి అవి యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. పెద్దల సాంఘీక దురాచారానికి ముక్కుపచ్చలారని ఆడపిల్లలు బలవుతున్నారు. దీంతో రాజస్తాన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని బుండీ జిల్లాలో మెుదలుపెట్టారు.

పెళ్లి పత్రికల్లో వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించాలని జిల్లా అధికారులు ప్రజలకు చెబుతున్నారు. ఎక్కువగా బుండీ జిల్లాలో  బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకట్ట వేయడం కోసం అధికారులు ఆ జిల్లాపై దృష్టి సారించారు. పుట్టిన తేదీతో పాటు బాల్యవివాహాలు నేరం అని కూడా ముద్రించాలని కోరుతున్నారు. అక్షయ తృతీయ రోజు మే 7న ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాలలో బాల్య వివాహాలు జరుగుతాయి. వాటిని నియంత్రించడం కోసం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రింటింగ్‌ ప్రెస్సులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. శుభకార్యాలు జరుగుతున్నప్రాంతాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు. ఉపాధ్యాయులు, భూరికార్టు ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు బాల్యవివాహాలు ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Rating: 5.0/5. From 2 votes.
Please wait...