‘తన బర్త్ డే రోజు విడుదల కానున్న ‘మహర్షి’ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరారు’ హీరో విజయ్ దేవరకొండ. సూపర్ స్టార్ మహేష్ బాబు 25 మూవీ ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా‌లో వైభవంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్ తదితర టాలీవుడ్ స్టార్లు హాజరుకాగా.. ఆకట్టుకునే స్పీచ్ ఇచ్చారు టాలీవుడ్ అర్జున్ రెడ్డి.

విజయ్ మాట్లాడుతూ.. ‘కామ్రేడ్స్.. మహేష్ బాబు అభిమానులు ఎలా ఉన్నారు. నా ఫేవరేట్ డైలాగ్.. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు ఈ డైలాగ్ అందరం కలిసి చెబుదాం.

మీ అందరికీ తెలుసు నేను మహేష్ బాబు ఫ్యాన్‌ని. మహేష్ బాబుని సార్ అని పిలవడం ఇబ్బందిగా ఉంటుంది.. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ నుండి మహేష్ బాబు.. మహేష్ బాబు అంటూ ఉన్నా. సడెన్‌గా స్టార్ అయ్యాక సార్ అని పిలవడం ఇబ్బందిగా ఉంది. మేం అందరం కాలేజ్‌లో ఉన్నప్పుడు మావాడే అనుకునేవాళ్ళం.

కాని ఇబ్బందిగా ఉన్నా.. మహేష్ బాబు అని వచ్చేస్తుంటుంది. నేను సినిమాలు చూడటం స్టార్ట్ చేసినప్పుడు మహేష్ బాబు మురారితో మొదలు పెట్టా. అప్పుడు ఫస్ట్ టైమ్ నేను మహేష్ సార్‌ని చూసినప్పుడు టిక్కెట్లకు చాలా కష్టపడ్డా. అమ్మాయిల క్యూ తొక్కువగా ఉండేది. అందుకే మహేష్ సినిమా ఉంది అంటే.. ఎవరొకరు అమ్మాయిని వెతుకునేవాళ్లం.

Previous article65 ఏళ్ల వయసులో వైద్యుడి వికృత చేష్టలు.. మహిళను..
Next articleమహర్షి’ ప్రీ రిలీజ్: ముస్తాబైన పీపుల్స్ ప్లాజా, న్యూ పోస్టర్ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిదా!