పసిడి ధర పరిగెత్తింది. దేశీ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.32,870కు చేరింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. బంగారం ధర గత రెండు రోజుల్లో ఎంత పడిపోయిందో.. ఈ ఒక్క రోజులోనే అంత పెరిగింది.

బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.295 పెరుగుదలతో రూ.38,520కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది.

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.11 శాతం తగ్గుదలతో 1,277.85 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.63 శాతం క్షీణతతో 14.82 డాలర్లకు తగ్గింది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.32,870కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.32,700కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా ఉంది.

కేజీ వెండి రూ.295 పెరుగుదలతో రూ.38,520కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.376 పెరుగుదలతో రూ.37,381కు ఎగసింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగింది.

హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,940కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,420కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.40,600కు చేరింది.

Rating: 4.0/5. From 1 vote.
Please wait...