రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో కనిపించకుండా పోయిన ఆర్టీసీ బస్సు… మహరాష్ట్రలోని నాందేడ్ ఓ షెడ్డులో‌ ప్రత్యక్ష్యమైంది. అయితే.. అప్పటికే ఆ బస్సును నామరూపాల్లేకుండా చేశారు కేటుగాళ్లు. బస్సులోని ఏ పార్ట్‌కు ఆ పార్ట్ విడదీసి సొమ్ము చేసుకున్నారు. ఈ ఘటనతో… ఆర్టీసీ బస్సుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సును మంగళవారం రాత్రి డ్రైవర్‌ సీబీఎస్‌లో పార్క్‌ చేశాడు. అయితే ఉదయానికి అది కనిపించలేదు. కంగు తిన్న డ్రైవర్‌ డిపో అధికారులకు సమాచారం ఇచ్చి… అప్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చేపట్టారు….

అర్ధరాత్రి దాటాక బస్సు తూఫ్రాన్‌ టోల్‌ప్లాజా దాటినట్లు గుర్తించిన అధికారులు… బస్సును దుండగులు నాందేడ్‌ వైపు తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు బస్సు నాందేడ్‌ శివార్లలోని ఓ షెడ్‌లో ఉన్నట్లు గుర్తించారు….

తీరా అక్కడికి వెళ్లే చూసే సరికి.. బస్సు ఛాసిస్‌ తప్ప మరేమీ మిగల్లేదు. అప్పటికే దుండగులు దాన్ని నామరూపాల్లేకుండా మార్చేసారు. గ్యాస్‌ కట్టర్లతో బాడీ మొత్తం కత్తిరించారు. బస్సుపై టాప్‌తో పాు చుట్టు పక్కల ఉన్న రేకుల్ని తొలగించారు. కింద టైర్లు.. ఇనుప చట్రాలు తప్ప ఏమీ లేకుండ తుక్కు తుక్కు చేశారు.

పోలీసులు అక్కడికి చేరుకోవడంతో.. నిందితుల భండారం బయటపడింది…. బస్సును చోరీ చేసిన ముగ్గురు పారిపోగా… షెడ్‌లో బస్సును ధ్వంసం చేస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఈ బస్సును అపహరించింది ఎవరు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

ఆర్టీసీ బస్సులకు భద్రత ఉంటుందని, ఇంజన్‌ లాక్‌ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఏకంగా బస్సే చోరికి గురికావడం, దాని స్పేర్‌ పార్ట్స్‌ను ఎక్కడిక్కడ విడదీసి అమ్మేయడంతో… బస్సుల భద్రత ప్రశ్నార్ధకం అయింది. తాజాగా ఘటనతో.. మిగిలిన ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఏంటనే చర్చ జరుగురుతోంది

Rating: 3.8/5. From 4 votes.
Please wait...