వైద్యం ముసుగులో వికృత చేష్టలకు పాల్పడుతున్న ఆర్‌ఎంపీ హరికృష్ణపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమృత నగర్‌లో ఉన్న కీచక ఆర్‌ఎంపీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. గుర్భిణిలకు స్కానింగ్ తీసే పేరుతో.. వారికి తెలియకుండా వీడియోలు చిత్రీకరించి.. వాటిని చూపించి బెదిరించి లోబర్చుకునేవాడు. ఇలాంటి నీచ కార్యకలాపాలకు పాల్పడుతున్న కామపిశాచి హరికృష్ణ నిర్వాకంపై వాస్తవవలు.

ప్రొద్దుటూరు మండలం అమృత నగర్‌లో హరికృష్ణ ఆర్‌ఎంపీ వైద్యునిగా అవతారమెత్తి వైద్యం మాటున వికృత చేష్టలు ప్రదర్శించేవాడు. కూలి నాలి చేసుకునే పేదలు వైద్యం కోసంవస్తే వారికి తెలియకుండా వీడియోలు తీసి, బ్లాక్‌మెయిల్‌ చేయడం ఆ కీచక డాక్టర్‌కు అలవాటైంది. అతడి వేషాలను టివి 5 వరుస కథనాలతో బట్టబయలు చేసింది. డాక్టర్‌ ముసుగు తీసి.. తోడేలు రూపాన్ని నడిరోడ్డుపై నిలబెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

No votes yet.
Please wait...