పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అతడితో విడిపోయి ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటున్నారు. ఆమె కూడా త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్నారు. ఆల్రెడీ వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగిన సంగతి తెలిసిందే. అయితే తనకు కాబోయే భర్త పేరు, ఫోటోలు బయటపెడితే ఆయన ఇబ్బంది పడతారనే భయంతో ఆ విషయాలు ఆమె బయటకు చెప్పడం లేదు. ”నన్ను పెళ్లాడబోయే వ్యక్తి పేరు చెప్పలేను. అలా చేస్తే ఆయన అనవసర ఇబ్బందులు ఎదురవుతాయి . ఆయన యూఎస్ రిటర్న్, పూణెలో ఉంటారు. ఐటీ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నారు.” అనే వివరాలు మాత్రమే వెల్లడించారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో రేణు దేశాయ్ భర్త ఇతడే అంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇటీవల అభిమానులతో లైవ్ చాట్ చేసిన ఆమె ఈ అంశంపై స్పందించారు

‘‘కొందరు నేను, నా తమ్ముడు కలిసి ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నా తమ్ముడి పెళ్లి సమయంలో దిగిన ఫోటో అది. కొందరు వెధవలు చెత్తవాగుడు వాగుతున్నారు. అతడు నా సొంత తమ్మడు. కానీ నా కాబోయే హస్బెండ్ అని కామెంట్ చేస్తున్నారు. అవి చూసి చాలా ఇరిటేట్ అయ్యాను.” అని రేణు దేశాయ్ తెలిపారు.

ఏపీ ఎన్నికలపై స్పందించాలని ఓ నెటిజన్ కోరగా… ‘‘ స్పందించను. పబ్లిగ్గా నా పొలిటికల్ ఒపీనియన్స్ ఇవ్వను. ఈ విషయాలు నా పర్సనల్ సర్కిల్ వద్ద మాత్రమే మాట్లాడతాను. ఇపుడు వాటి గురించి ఏదైనా మాట్లాడితే అది మరోలా తీసుకుని పెద్ద రచ్చ చేస్తారు. నాకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ అది ప్రజలతో పంచుకోవాల్సిన సమయం ఇది కాదు’ అన్నారు.

‘‘ఆద్య, అకీరా చాలా బావున్నారు. స్విమ్మింగ్ వెళుతున్నారు. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. వారి గురించి ఎవరూ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.” అన్నారు. ఇటీవల అలీ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ తన పిల్లల గురించి మాట్లాడుతూ… అకీరా, ఆధ్య లేకుంటే నేను బ్రతకలేను. వారే నా ప్రపంచమని తెలిపారు.

‘‘అలీ షో తర్వాత కొందరు చెత్త మెసేజెస్ పంపించారు. నేను కావాలనే ఎన్నికల కోసం ఇదంతా చేస్తున్నానంటూ నాపై కామెంట్లతో ఎటాక్ చేస్తున్నారు. కానీ నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు. అది చాలా రోజుల క్రితమే షూట్ చేశారు. అలీగారికి, కళ్యాణ్ గారికి మధ్య మాటల యుద్ధం జరుగడానికి ముందే ఆ ఇంటర్వ్యూ షూట్ చేయడం జరిగింది.” అని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.

Rating: 5.0/5. From 1 vote.
Please wait...