బుల్లితెరపై సందడి చేస్తోన్న బ్యూటీఫుల్ యాంకర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది రష్మీ. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం జబర్ధస్త్, ఢీ షోలతో బిజీగా ఉన్న భామ రష్మీ. ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్‌ కావడంతో పాటు రేటింగ్‌లో కూడా దాదాపు మొదటి స్థానంలో ఉంటుంది జబర్ధస్త్.

తాజాగా రష్మీకి ఓ యువకుడి నుంచి బెదిరిపు కాల్స్ వచ్చాయి. రాసలీలలు బయటపెడతానంటూ కాల్ చేశాడు. దానికి రష్మీ ఏ మాత్రం వెరవకుండా.. ఏం బెదిరిస్తున్నావా.. నీ దగ్గర నాకు సంబంధించిన వీడియోలు ఏవుంటే అవి పెట్టు. నేను ఏ తప్పు చేయలేదు.. మరి అలాంటప్పుడు భయపడడం దేనికి అని బాగానే చీవాట్లు పెట్టింది. రష్మీ అభిమానులనుంచి సరిగ్గా బుద్ది చెప్పారు మేడమ్ అంటూ నెటిజన్స్ మద్దతు పలుకుతున్నారు.
రష్మీ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు..

ఒరిస్సాకు చెందిన రష్మీగౌతమ్ కుటుంబం వైజాగ్‌లో సెటిలవడంతో ఆమె అక్కడే పుట్టి పెరిగింది. 2002లో సవ్వడి అనే చిత్రంలో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఏవో కొన్ని కారణాలతో ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఆ తరువాత అదే సంవత్సరంలో ఉదయకిరణ్, రిచా నటించిన ‘హోలీ’ చిత్రంలో ఒక చిన్న పాత్రతో సరిపెట్టుకుంది. సునీల్ పక్కన కామెడీ పండించే పాత్రలో నటించింది. అన్నపూర్ణ బ్యానర్‌లో వచ్చిన యువ సీరియల్‌లో రష్మీ హీరోయిన్ రోల్ పోషించింది.

ఆ తరువాత ప్రస్థానం సినిమాలో కనిపించింది. లవ్ అనే కాన్సెప్ట్‌తో యూత్ ఓరియంటెడ్ సీరియల్‌లో ప్రధాన పాత్రలో కనిపించింది.
రష్మీకి బ్రేక్ ఇచ్చింది ఖడ్గం ఫేమ్ సంగీత. సందర్భం వచ్చినప్పుడల్లా రష్మీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంది. రష్మీ ఫేవరెట్ హీరో ప్రభాస్. ఆయనతో నటించే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తానంటోంది. యాంకర్ అనసూయ, తాను మంచి ఫ్రెండ్స్ అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

ఇక సుధీర్‌తో తన లవ్ ఎంతవరకు నిజమో కాని.. ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకుని చేస్తున్న స్పెషల్ షోలకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పండి అత్యధిక వ్యూయర్ షిప్‌ని సంపాదించి పెడుతుంది చానెల్స్‌కి.

No votes yet.
Please wait...