ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సీ అశ్వినీదత్, పీవీపీ నిర్మాణ సారథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం విడుదలై మంచి స్పందనను కూడగట్టుకొంటున్నది. భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు, వంశీ పైడిపల్లి, అల్లరి నరేష్, దిల్ రాజు, అశ్వినీదత్, పోసాని, రాజీవ్ కనకాల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ..

మహర్షి చిత్రం మహేష్ బాబు కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ సినిమా అంతా బాగా తీశారు. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక ముందు నుంచి తెలుగు సినిమాలు తీయడం మానేసి హాలీవుడ్ సినిమాలు తీయాలని దర్శకుడు వంశీ పైడిపల్లికి సూచన చేస్తున్నాను. ఆయన రూపొందించిన సినిమాలు నేను చూశాను. ఎక్కడా ఇంత తడబాటు కూడా కథలో కనిపించదు అని పోసాని అన్నారు.

మహర్షి సినిమాలో మహేష్ బాబును చూస్తే నాకు ఒకటి అనిపించింది. నేను ఆడపిల్లగా పుడితే నీవు ఒప్పుకొనే వరకు వెంటపడేదానిని. నీకు పెళ్లి అయినా నీ జీవితంలో నాకు ఏదో ప్లేస్ ఇస్తే.. నిన్ను చూసి బతుకుతాను. పిల్లలు లేకపోయినా, పుట్టకపోయినా అడ్జస్ట్ అయిపోతాను అని పోసాని అన్నారు.

మహేష్ బాబు అందం చూస్తే మగాళ్లకే జెలసీ పుడుతుంది. ఆయన ముక్కు లేదు, ఆయనలా నవ్వు లేదు. ఆయనలా అందంగా ఎందుకు పుట్టలేదు అని ఇంట్లో భార్యలు అంటుంటారు. మహేష్ బాబు అందంగా పుట్టారు. మీరెందుకు అందంగా పుట్టలేదు అని అంటారు అని మహేష్ బాబును పోసాని పొగడ్తలతో ముంచెత్తారు.

మహర్షి సినిమాలో మహేష్ బాబు పక్కన నటించడానికి పూజా హెగ్డే ఇబ్బంది పడింది. ఆయన పక్కన తేలిపోయింది. మహేష్ పక్కన ఉంటే ఆమెను ఎవరు చూడలేదు అని పేపర్లో, టెలివిజన్‌లో రాశారు. వేశారు. నేను ఏదో నా సొంత మాటగా చెప్పడం లేదు అని పోసాని అన్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ బతికేది కేవలం దిల్ రాజు వల్లనే. ఏడాదికి పెద్ద హీరో సినిమాలు పది వస్తాయోమే. కానీ దిల్ రాజు ఒక్కడే ఐదు లేదా ఆరు సినిమాలు తీసి డైరెక్టర్ల నుంచి కారు డ్రైవర్ వరకు బతికేలా చేస్తున్నారు. పెద్ద హీరో సినిమాను ఎంతగా ప్రేమిస్తారో.. చిన్న సినిమాను కూడా అంతే ప్రేమిస్తారు. దిల్ మీరు చాలా గ్రేట్ అని పోసాని పేర్కొన్నారు.

నేను చెన్నైలో ఉన్నప్పుడు నిర్మాత అశ్వినీదత్ పెద్ద ప్రొడ్యూసర్. వైజయంతీ మూవీస్ పెద్ద బ్యానర్. స్వర్గీయ ఎన్టీఆర్‌తో ఎదురులేని మనిషి సినిమాను తొలి చిత్రంగా తీశారు. మహేష్ బాబు హీరోగా పెట్టి రాజకుమారుడు తీశారు. అలాంటి ప్రొడ్యూసర్ ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మీరు కూడా సినిమాలు తీసి ఇండస్ట్రీకి లైఫ్ట్, రైట్ హ్యాండ్‌గా ఉండాలి అని పోసాని అన్నారు.

No votes yet.
Please wait...