కేసీఆర్ కు పవన్ సలహా! : రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఓటుకు నోటు కేసు తిరగదోడండి… జగన్ కు మాత్రం సాయం వద్దు

0
332

వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు, పదిమంది కూడా వెనుక లేకుండా ఉద్యమం ఏం చేస్తారంటూ ప్రశ్నించిన విషయాన్ని మర్చి పోయార కేసీార్, అన్నపూర్ణ స్టూడియో వద్ద కారు బాంబు పేలుడును, మానుకోట రైల్వే స్టేషన్ ఘటనను ప్రస్తావించారు. తిరుమలకు చెప్పులతో వచ్చిన జగన్ వంటి వ్యక్తిని వెనుకేసుకుని వచ్చి, ఏపీ ప్రజలకు నష్టం కలిగించవద్దని ఆయన అన్నారు.

తెలంగాణా వేరు ఆంధ్ర వేరని గుర్తుంచుకోవాలని సూచన
హైదరాబాద్ లో ఉన్న ఇంటిని సీజ్ చేసుకోండి
బాబుపై కోపంతో జగన్ కు మాత్రం మద్దతు ఇవ్వొద్దు

“మీరు చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని అనుకుంటే, హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇంటిని సీజ్‌ చేసుకోవచ్చు. ఓటుకు నోటు కేసును తిరగతోడవచ్చు. అంతే తప్ప అవి పక్కనబెట్టి చంద్రబాబు మీద కోపంతో జగన్‌ కు మద్దతు ఇస్తే మాత్రం నేను మొన్నటి తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో పోరాడుతాను. ఆంధ్ర ప్రజలు వేరు, పాలకులు వేరని గుర్తుంచుకోండి” అని బీఎస్పీ – జనసేన బహిరంగ సభలో పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సలహా ఇచ్చారు.

Rating: 5.0/5. From 1 vote.
Please wait...