చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన రోగుల బాగోగులు చూడాల్సిన నర్సు.. సిగ్గుమాలిన చర్యకు పాల్పడింది. చికిత్స సమయంలో నగ్నంగా ఉన్న చిన్నారులు, టీనేజర్ల ఫొటోలు, వీడియోలు తీసి తన ప్రియుడికి పంపింది. ఇలా 17 మంది రోగులకు చెందిన 20పైగా ఫొటోలు, వీడియోలను తీసింది. చివరికి ఉద్యోగాన్ని పోగొట్టుకుని, ఊచలు లెక్కిస్తోంది.

పెన్సిల్వేనియాలోని అల్లెఘేనీ కౌంటీలో గల మెక్‌కీస్పార్ట్ కమ్యునిటీ లివింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న అస్లే అన్ స్మిత్ (30).. ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్య పరీక్షల నిమిత్తం నగ్నంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసేది. అనంతరం వాటిని తన ప్రియుడు విట్టేకర్ (36)కు పంపేది. ఈ సమాచారం ఆసుపత్రి నిర్వాహకులకు తెలియడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెపై చైల్డ్ పోర్నోగ్రఫీ కింద కేసు నమోదు చేశారు.

ఆమె మొబైల్‌లో రెండేళ్ల చిన్నారికి సంబంధించిన నగ్న చిత్రాలను కూడా కనుగొన్నారు. దీంతో ఆమెకు కోర్టు కఠిన శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే, ఈ కేసులో ఆమె ప్రియుడి విట్టేకర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే, అతడు గతేడాది నుంచి ఆమెతో దూరంగా ఉంటున్నానని, తాను అడగకుండానే ఆమె ఆ ఫొటోలను పంపేదని విట్టేకర్ తెలిపినట్లు సమాచారం.

No votes yet.
Please wait...