సూర్య నటిస్తున్న తాజా చిత్రం ఎన్జీకే. సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కితున్నారు. మే 31న ఎన్జీకే చిత్రాలు తెలుగు తమిళ భాషలో విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్జీకే చిత్ర ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మాస్ పొలిటికల్ లీడర్ పాత్రలో సూర్య అదరగొడుతున్నాడు. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆసక్తి రేపుతున్న ఎన్జీకే చిత్ర ట్రైలర్ లోని విశేషాలు ఇప్పుడు చూద్దాం!

ట్రైలర్ ఆరంభంలో.. ఎన్జీకే.. ఎన్జీకే అంటూ నినాదాలు వినిపిస్తాయి. సూర్య మాస్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తున్నాడు. ‘ చిన్న గుంపుని ఏసుకుని రాజకీయాల్లోకి వచ్చేస్తే.. నిన్ను రానిస్తారని అనుకున్నావా’ అనే డైలాగ్ వినిపిస్తుంది. సూర్య తల్లి అతడి రాజకీయాలపై భయపడుతూ కనిపిస్తుంది. రేయ్ అది శ్మశానం.. లోనికి వెళితే శవంగానే బయటకు వచ్చేది అంటూ ఏడుస్తూ చెబుతుంది. సూర్య చేస్తున్న పోరాటాలు, పొలిటికల్ సెటప్ ని ట్రైలర్ లో బాగా చూపించారు.

Previous articleమహేశ్ 26వ సినిమా .. కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
Next articleHyper Aadi.. అది కోసేస్తా బిడ్డ: శ్రీరెడ్డి బూతు పురాణం