ఓ యువకుడు 15 ఏళ్ల వయస్సులో ఓ లక్ష్యం పెట్టుకున్నాడు. దాన్ని నెరవేర్చుకోవడం కోసం 23 ఏళ్ల వయస్సులో తన పురుషాంగాన్ని, వృషణాలను కోసేసుకున్నాడు. అయితే, తాను చేసిన పనికి అతడు చింతించలేదు. పైగా గర్వపడుతున్నాడు. ఇప్పుడు తనకు సెక్స్ కూడా చాలా సుఖంగా అనిపిస్తోందని అంటున్నాడు. ఇంతకీ అతడి లక్ష్యం ఏమిటంటే…

వాషింగ్టన్ డీసీకి చెందిన ట్రెంట్ గేట్స్ (23) ఏప్రిల్ 2016లో తన వృషణాలను కట్ చేసుకున్నాడు. ఆ తర్వాత 2017 జనవరిలో పదునైనా సిరామిక్ కత్తితో తన పురుషాంగాన్ని కత్తిరించుకున్నాడు. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే.. జననేంద్రియాలు లేని వ్యక్తి(నల్)గా మారాలనే లక్ష్యంతో ఈ చర్యకు పాల్పడ్డానని తెలిపాడు. 15 ఏళ్ల వయస్సులో గెల్డింగ్ అనే వ్యక్తి తన పురుషాంగం, వృషణాలను కట్ చేయించుకున్న ఫొటో ఒకటి చూశానని, అప్పటి నుంచి తనకు కూడా అలా మారాలనిపించిందని గేట్స్ తెలిపాడు.

మొదటిసారి వృషణాలను కత్తిరించుకున్నప్పుడు నొప్పి రాకుండా ఉండేందుకు చల్లని నీటిని ఉపయోగించానని తెలిపాడు. రెండో ప్రయత్నంలో పురుషాంగం కత్తిరించుకునేందుకు పెయిన్ కిల్లర్స్ వాడానని తెలిపాడు. అయితే, ఈ విషయం తన కుటుంబికులకు తెలియకుండా జాగ్రత్తపడ్డానన్నాడు. ‘‘నాకు పురుషుడిగా, మహిళగా ఉండాలనే ఆలోచన లేదు. పురుషాంగం, వృషణాలను చూసుకున్నప్పుడల్లా.. అవి నావి కావని అనుకొనేవాడిని. వాటిని కట్ చేసుకోడానికి నాకు భయం వేయలేదు. పెయిన్ కిల్లర్స్‌తో ఆ పని కానిచ్చేశా. ఆ తర్వాత వెంటనే ఆసుపత్రిలో చేరి.. తనకు ఆ అవయవాలేవీ తిరిగి అతికించకుండా ‘నల్’గా ఉంచేయండని కోరాను’’ అని గేట్స్ తెలిపాడు.

గేట్స్ తన మర్మాంగాలను కట్ చేసుకున్న తర్వాత వైద్యులు ఇక తిరిగి అతికించలేదు. ఈ నిర్ణయం తీసుకోడానికి ముందు అతడు మతిస్థిమితంతో ఉన్నాడా, లేడా అని తెలుసుకున్నారు. చివరికి అతడికి మూత్రం మాత్రం బయటకు వచ్చేలా రంథ్రాన్ని వదిలి శస్త్ర చికిత్స పూర్తి చేశారు. గేట్స్ కొన్ని నెలల తర్వాత ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. ముందు వారు షాకైనా, చేసేదీ ఏదీ లేక అతడి నిర్ణయాన్ని సమర్దించారు. ప్రస్తుతం తాను తన బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతున్నాడు. వెర్రి వేయి విధాలంటే ఇదే కాబోలు!!

No votes yet.
Please wait...