మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో నిర్మితమైన ‘మహర్షి’ .. ఈ నెల 9వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు కనిపించే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో మహేశ్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిపోవడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రీమేక్ పై తమిళ స్టార్ హీరో విజయ్ దృష్టిపెట్టినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. గతంలో తెలుగులో మహేశ్ బాబు చేసిన ‘పోకిరి’ .. ‘ఒక్కడు’ సినిమాలు, తమిళంలో విజయ్ హీరోగా రీమేక్ చేశారు. ఆ సినిమాలు ఆయనకి భారీ విజయాలను అందించాయి. దాంతో ‘మహర్షి’ సినిమా రీమేక్ పై విజయ్ దృష్టిపెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ‘మహర్షి’ ఫలితం ఎలా ఉంటుందో చూసుకుని విజయ్ రంగంలోకి దిగొచ్చని చెప్పుకుంటున్నారు.

No votes yet.
Please wait...