సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’. మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం (మే 1) గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. నక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఈ వేడుక జరుగబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా విడుదల చేసిన ‘మహర్షి’ న్యూ పోస్టర్ చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు, ముఖ్యంగా జనసేన పార్టీకి చెందిన వారు ఫిదా అవుతున్నారు. అందుకు కారణం ఈ పోస్టర్లో మహేష్ గాజు గ్లాసులో టీ తాగుతూ కనిపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించిన సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతిలో గాజు గ్లాస్ చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పులకించి పోతున్నారు. ‘మహర్షి’ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మహేష్ చేతిలో గాజు గ్లాస్ అద్భుతంగా ఇమిడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ న్యూ పోస్టర్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బుధవారం సాయంత్రం పీపుల్స్ ప్లాజా వద్ద జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు భారీగా చేశారు. మంగళవారం రాత్రి నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంటుగా, రైతుగా, బిజినెస్‌మెన్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. దీన్ని ఫోకస్ చేసేలా ఈ మూడు పాత్రల్లో మహేష్ బాబు లుక్ ప్రతిబింభిస్తూ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వేల సంఖ్యలో అభిమానులు తరలిరాబోతున్నారు. ఇప్పటికే అభిమాన సంఘాలకు ఈవెంట్ పాసెస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి.

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి’ తెరకెక్కుతోంది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా… అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

Rating: 5.0/5. From 1 vote.
Please wait...