‘మహర్షి’ నుంచి మరో సాంగ్ ‘పదరా .. పదరా’

0
154

మహేశ్ బాబు కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో ‘మహర్షి’, వినోదం .. సందేశం ప్రధానంగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను రూపొందించాడు. మే 1వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి, 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ‘పదరా .. పదరా .. పదరా .. నీ అడుగుకి పదునుపెట్టి పదరా’ అనే ఒక సాంగును విడుదల చేశారు.

ఈ పాటలో తలపాగా చుట్టి .. నాగలిపట్టి పొలం దున్నుతూ మహేశ్ బాబు కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం .. శంకర్ మహదేవన్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఇంతకుముందు వదిలిన 3 పాటలకు ఓ మాదిరి రెస్పాన్స్ ఉండటంతో, ఈ పాటపైనే ఈ సినిమా టీమ్ ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలను ఈ పాట నెరవేర్చేలానే అనిపిస్తోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికగా పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే.

No votes yet.
Please wait...