సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ సినిమా ‘మహర్షి’. మే 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా 1900ల స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. తెలుగులో ఇప్పటి వరకు బాహుబలి తర్వాత అత్యధిక థియేటర్లలో రిలీజవుతున్న సినిమాగా ఒక కొత్త రికార్డుని మహేష్ బాబు నెలకొల్పాడు.

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా కూడా ఘనమైన విజయాన్ని నమోదు చేసుకోలేదు. దీంతో మహర్షి మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ టాక్ కూడా చాలా బాగుండటంతో మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అసలే వేసవి సెలవులు. అందులోనూ ఈ సమ్మర్‌ సీజన్‌లో పెద్ద హిరోలా సినిమాలేవీ లేవు. దీంతో సినిమాకి చాలా అడ్వాంటేజ్ గా మారింది. ఈ సమ్మర్లో రిలీజవుతున్న ఒకే ఒక్క స్టార్ సినిమా అవడంతో భారీ మార్కెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో సూపర్ స్టార్ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. దీంతో మహర్షి బాక్సాఫీస్‌ని షేక్ చేసే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ వేసవి వినోదాన్ని ‘మహర్షి’ చిత్రంతో ప్రేక్షకులకు అందించేందుకు మహేష్ మే 9న థియేటర్స్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘మహర్షి’.. యు/ఎ సర్టిఫికెట్ పొందింది.

ఇక ఈ మూవీలో మహేష్‌కి జోడిగా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు.

No votes yet.
Please wait...