ఇల్లు చిన్నదైనా టీవీ పెద్దగా ఉండాలి. అందునా పక్కింటి వాళ్ల టీవీ కంటే మనది మరి కొంచెం పెద్దగా ఉంటే మరింత హ్యాపీ. మరి అంత టీవీ కొనాలంటే మార్కెట్లో రేట్లు అదిరిపోతున్నాయి. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని జపాన్‌కు చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జేవీసీ తాజాగా కొత్త స్మార్ట్ టీవీలను దేశీ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఆరు కొత్త స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీలను రిలీజ్ చేసింది. ఇక స్క్రీన్ సైజ్ 40 నుంచి 55 అంగుళాల మధ్య ఉన్న వీటి ధర విషయానికి వస్తే రూ.18,999 నుంచి ప్రారంభమవుతుంది. ఎక్సేంజ్ ఆఫర్‌లో అయితే రూ.8,000 వరకు తగ్గింపు ధరకు లభిస్తుంది.

ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉంటే 5 శాతం అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో 40 అంగుళాల టీవీ ధర మరింత తగ్గి రూ.9,749కే వస్తుంది. హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ప్లిక్స్, యూట్యూబ్ వంటి యాప్స్ అన్ని ఈ టీవీల్లో పని చేస్తాయి. ఈ టీవీల్లో 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 20 వాట్ సౌండ్ ఔట్‌పుట్, 2 యూఎస్‌బీ పోర్ట్స్, 2 హెచ్‌డీఎంఐ పోర్ట్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వైఫై, ల్యాన్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. జేవీసీ కంపెనీ ఇన్-కార్ ఆడియో ఎక్విప్‌మెంట్, హెడ్‌ఫోన్స్, ప్రొజెక్టర్స్ వంటి వాటికి ఫేమస్. భారత్‌లో జేవీసీ టీవీలను వియారా గ్రూప్ మార్కెటింగ్ చేస్తుంది.

Rating: 5.0/5. From 1 vote.
Please wait...