‘బిగ్ బాస్ 2’ విజేతగా నిలిచిన కౌశల్ .. బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. “నటుడిగా అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడ్డాను. అదే సమయంలో మోడలింగ్ వైపు కూడా దృష్టిపెట్టాను.

కెరియర్ పరంగా నేను సతమతమవుతున్న రోజుల్లోనే మా అమ్మకి కేన్సర్ వచ్చింది. ఆమె ట్రీట్మెంట్ కి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైంది. అలాంటి పరిస్థితుల్లో ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా నేను చేయకుండా ఉండవలసింది .. కానీ నాకు డబ్బు అవసరం. ఆ సినిమా చేయడం వలన వచ్చే డబ్బులు అమ్మ ట్రీట్మెంట్ కి ఉపయోగపడుతుందని భావించి ఆ సినిమా చేశాను. నటుడిగా నా కెరియర్ దెబ్బతినడానికి ఆ సినిమాయే కారణం” అంటూ చెప్పుకొచ్చాడు.

No votes yet.
Please wait...