ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ బోర్డు ఫలితాల గందరగోళంపై సమీక్ష నిర్వహించారు. పరీక్ష పెయిల్ అయిన విద్యార్దులందరి పరీక్ష పత్రాలను రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ఆయన ఆదేశించారు. అది కూడా ఉచితంగా చేయాలని ఆయన స్పస్పం చేశారు.ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్నదానిపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. అంతేకాక భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా తీసుకోవలసిన చర్యలపై నివేదిక తయారు చేయాలని విద్యా శాఖ కార్యదర్శి జనార్ధనరెడ్డి ని ఆదేశించారు. ఈ సమావేశానికి విద్యా మంత్రి జగదీష్ రెడ్డి , ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ హాజరయ్యారు. కాగా నాలుగో రోజు కూడా విద్యార్ధులు, ఆయా పక్షాల నేతలు ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు నిర్వహించారు.

No votes yet.
Please wait...