గాజువాక గడ్డ జనసేన అడ్డా అని ఆ పార్టీ పేర్కొంది. బుధవారం గాజువాక నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా.. పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌ మాదాసు గంగాధరం మాట్లాడుతూ ఐదు లోక్ సభ స్థానాల్లో తమ పార్టీ గెలుస్తుందన్నారు. విశాఖపట్నం, నరసాపురం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ లోక్‌ సభ స్థానాల్లో జనసేన గెలవడం ఖాయమన్నారు. మిగిలిన లోక్‌ సభ స్థానాల్లో తమ పార్టీ గట్టిపోటీ ఇస్తుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్టంలో మార్పు మొదలైందని, సార్వత్రిక ఎన్నికల్లో యువత, మహిళలు, వృద్ధులు జనసేన పార్టీకి అండగా నిలబడ్డారని మాదాసు చెప్పారు. మరికొద్ది రోజుల్లో అనూహ్య ఫలితాలు వెలువడతాయన్నారు.

పవన్ కళ్యాణ్ నిద్రాహారాలు మాని ప్రజాసేవ చేస్తున్నారని మాదాసు తెలిపారు. ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలంగానే ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కనిపిస్తుందన్నారు.. రాజ్యాధికారం చేపట్టడానికి బహుజన సమాజ్‌ వాది పార్టీకి 25 ఏళ్లు పడితే… జనసేన మాత్రం ఐదేళ్లలో రాజ్యాధికారం చేపట్టబోతుందన్నారు. ఎన్నికల తర్వాత కూడా జనసేన నాయకులు ప్రజల మధ్య తిరుగుతుంటే అధికార, ప్రతిపకాలకు గుండెలు గుభేల్‌ అంటున్నాయన్నారు.

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటన విడుదల చేయగానే… తెలంగాణ ప్రభుత్వం ఉచితంగారీవాల్యూషన్‌ చేస్తున్నట్లు ప్రకటించిందని మాదాసు తెలిపారు.

జనసేనాని రాజకీయ సలహాదారుడు పి.రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ మనకు లభించిన వజ్రమన్నారు. ‘‘కోహినూర్‌ కంటే వేల రెట్లు ప్రకాశవంతమైన వజ్రం ఆయన. సమాజంలో మార్పు కోసం ఇంత పరితపిస్తున్న వ్యక్తిని నా 34 ఏళ్ల ఐఏఎస్‌ ఉద్యోగ జీవితంలో చూడలేదు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రచారం చేశారు. శ్రీ కృష్ణుడు గోవర్ధనగిరి మోసినట్లు .. పవన్‌ కళ్యాణ్‌ ఒక్కరే జనసేన పార్టీని మోస్తున్నారు. ఆయన ఆస్తులను ఖర్చు చేసిపార్టీని నడుపుతున్నార’’ని తెలిపారు.

No votes yet.
Please wait...