ఏదైనా అందీ అందకుండా ఉంటేనే ముద్దు. కావలసిన వన్నీ కళ్లముందే నిమిషాల్లో ప్రత్యక్షమవుతుంటే లైఫ్ బోర్ కొట్టేస్తుంది. అనుకోకుండా వచ్చిపడిన డబ్బుతో అందలం ఎక్కేసింది. పాతికేళ్లు వచ్చేసరికి అన్నీ అనుభవించేసింది. స్వర్గ సుఖాల్లో మునిగి తేలింది. అన్నీ రుచి చూడడంతో మరింకేమీ రుచించలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. కోట్ల డబ్బు తనని ఇక కొంచెం కూడా సంతోషంగా ఉంచలేకపోయింది. దాంతో ఉద్యోగం కావాలంటూ అప్లికేషన్ పెట్టింది.

బ్రిటన్‌కి చెందిన జెనా పార్క్ 17 ఏళ్ల వయసులో సరదాగా లాటరీ టికెట్ కొంది. అదృష్టం ఆమె తలుపు తట్టి 100 కోట్లు లాటరీలో గెలుచుకుంది. చుట్టూ సముద్రం మధ్యలో భూమిలా ఉంది తన పరిస్థితి. చూట్టూ డబ్బు.. మధ్యలో తను. బ్రిటన్‌లోనే యంగెస్ట్ మిలియనీర్‌గా రికార్డుకెక్కింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. లగ్జరీ లైఫ్ స్టైల్. సెలబ్రిటీ స్టేటస్.. జెన్ పార్క్‌కి ప్రపంచంమే స్వర్గంలా మారిపోయిందేమో అనిపించింది ఒకానొక టైమ్‌లో. తనకో బాయ్ ఫ్రెండ్ కావాలని అందుకోసం అతడికి రూ.50 లక్షల జీతం ఇస్తానంటూ ఆఫర్ చేసేసరికి అబ్బాయిలంతా క్యూ కట్టేశారు జెన్ ఇంటిముందు.

దాదాపు 10 వేల అప్లికేషన్లు వస్తే అందులో ఒక్కర్ని సెలక్ట్ చేసుకుంది. కొన్ని రోజులు అతడితో.. ఆ తరువాత మరొకరు. ఇలా 5 సంవత్సరాల్లో ఇష్టం వచ్చినట్లు బాయ్ ఫ్రెండ్స్‌ని మార్చేసింది. ఇక లైఫ్ బోర్ కొట్టేసింది. నాకొద్దీ జీవితం అంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతోంది. అయిన వాళ్లంతా దూరమయ్యారు. డబ్బు మదంతో అందర్నీ దూరం చేసుకున్నాను. ప్రేమగా పలకరించే వారే లేరు. ఏదో ఆశించి వచ్చే వారే కనిపించారు. కళ్లు మూసుకుపోయి ఆ విషయం కనిపెట్టలేకపోయాను. ఇప్పుడు కళ్లు తెరుచుకున్నాను. నాకీ డబ్బూ వద్దూ.. ఈ జీవితమూ వద్దు. సాధారణ జీవితం గడపాలనుకుంటున్నాను. అందుకు నాకో ఉద్యోగం కావాలి. కష్టపడుతూ వచ్చిన దాంతో తృప్తిగా బ్రతకాలని కోరుకుంటోంది జెన్.

No votes yet.
Please wait...