భారత రక్షణశాఖ….. విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. సైన్యంలో మహిళలను నియమించుకోనుంది. అర్హులైన మహిళలనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సాధారణంగా మహిళలను ఆఫీసర్‌ ర్యాంక్‌ స్థాయిలో నియమించుకుంటారు. కానీ… దీనికి భిన్నంగా జవాన్ల స్థాయిలో మహిళలను నియమించడం ఇదే తొలిసారి.

భారత సైన్యం చరిత్ర సృష్టించింది. ఆర్మీలో సేవలు అందించేందుకు స్త్రీలకు ఆహ్వానం పలుకుతూ ఇండియన్ ఆర్మీ చారిత్రక నిర్ణయం తీసుకుంది. జవాన్లుగా మహిళలు కూడా సేవలందించేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికే షన్‌ జారీ చేసింది. మొదటి దశలో సైన్యంలో 100 మంది మహిళా సైనికుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వా నించింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జూన్‌ 8లోపు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది

దేశవ్యాప్తంగా అంబాలా, లక్నో, జబల్‌పూర్‌, బెంగళూర్‌, షిల్లాంగ్‌ల్లో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు నిర్వహిస్తారు. కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా రాతపరీక్ష నిర్వహిస్తారు. మహిళా సైనికులకు గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు. కనీస వయస్సు 17.5 సంవత్సరాలు. విధి నిర్వహణలో అసువులు బాసిన రక్షణ సిబ్బంది జీవిత భాగస్వాము లకు గరిష్ట వయోపరిమితిని 30 సంవత్సరాల వరకూ సడలించారు..ఎంపికైన అభ్యర్ధులు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీల్లో వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు

ఇప్పటి వరకు ఆర్మీలో మెడికల్, లీగల్, ఎడ్యుకేషనల్, సిగ్నల్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లోనే మహిళలు పని చేస్తున్నారు. ఐతే, మహిళలకు క్షేత్రస్థాయిలో జవాన్లుగా పని చేసే అవకాశం కల్పించాలని డిమాండ్లు వచ్చాయి. ఆ డిమాండ్లపై అటు భారత సైన్యం, ఇటు కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నాయి. సుదీర్ఘ మంతనాల తర్వాత జవాన్లుగా మహిళలకు కూడా అవకాశం కల్పించాలని ఈ ఏడాది ప్రారంభంలో నిర్ణయం తీసుకు న్నారు. మిలటరీ పోలీసు విభాగంలో 20 శాతం వరకు మహిళలను తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే… ఈ ప్రతిపాదనపై ఆమోద ముద్రవేసిటన్లు తెలుస్తోంది.

Rating: 5.0/5. From 1 vote.
Please wait...