హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లారు దుండగులు. MGBS దగ్గరున్న గౌలిగూడ బస్టాప్‌లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నైట్‌హాల్ట్‌ కోసం బస్సును నిలిపాడు డ్రైవర్. అంతే.. అది మాయం అయిపోయింది. ఎవరు ఎత్తుకెళ్లారు.. ఏం చేస్తున్నారనే సమాచారం అటు ఆర్టీసీ అధికారులకు, ఇటు పోలీసులకు తెలియడం లేదు. అయితే.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తూప్రాన్‌ ప్రాంతంలో ఆ సిటీ బస్సు తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఆ మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. దాదాపు 24 గంటలు కావస్తున్నా కుషాయిగూడ డిపోకు చెందిన బస్సు ఆచూకీని తెలుసుకోలేకపోయారు.

No votes yet.
Please wait...