ప్రభాస్‌ను ఆ భూముల్లోంచి ఖాళీ చేయించడం చట్టవిరుద్ధం: హైకోర్టు తీర్పు

0
149

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని తన భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ గేటుకు తాళాలు వేయడాన్ని సవాలు చేస్తూ ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఆ భూముల నుంచి ప్రభాస్‌ను ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమన్న కోర్టు, ప్రభాస్ పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తుపై 8 వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం దరఖాస్తును తిరస్కరిస్తే, ప్రభాస్ మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది.

అయితే, 1958 నుంచి భూములకు సంబంధించిన వివాదం నడుస్తున్నందు వల్ల ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని, ప్రభాస్‌కు అప్పగించలేమని స్పష్టం చేసింది. ఆరు దశాబ్దాలకుపైగా వివాదంలో ఉన్న పలు భూముల వ్యవహారంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని, వివాదాలు సమసిపోతాయని పేర్కొన్న కోర్టు ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది.

No votes yet.
Please wait...