65 ఏళ్ల వయసులో ఓ వైద్యుడి వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌లో హోమియోపతి క్లీనిక్‌ నడుపుతున్న చంద్రమోహన్‌కు స్థానికంగా మంచి పేరు ఉంది. దీంతో చాలామంది అతడి దగ్గరకు వైద్యానికి వస్తుంటారు. ఇటీవల చర్మ వ్యాధితో ఇబ్బంది పడుతున్న మహిళ.. చంద్రమోహన్‌ దగ్గర వైద్యం తీసుకుంటోంది. నిన్న ఆ మహిళ ఆస్పత్రికి ఒంటరిగా రావడంతో చంద్రమోహన్‌లోని కామాంధుడు బయటపడ్డాడు. చిలిపి చేష్టలతో రెచ్చిపోయాడు..

ఏడుస్తూ ఇంటికి వచ్చిన భార్యను చూసి ఏం జరిగిందని భర్త అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చంది. ఇష్టం వచ్చిన చోటల్లా టచ్‌ చేసి.. అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె భర్తకు తెలిపింది. దీంతో చిలకలగూడ పోలీసులకు ఆ ఫిర్యాదు చేశాడు. భార్యభర్తల ఫిర్యాదుతో డాక్టర్‌ వైద్యుడు చంద్రమోహన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు 354,417 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Rating: 5.0/5. From 2 votes.
Please wait...