దిషా పటాని ఇక సోషల్‌ మీడియా సెన్సేషన్‌ మాత్రమే కాదు. ఇంతకాలం చిన్న హీరోలతో మాత్రమే నటిస్తూ వచ్చిన దిషా పటానికి బాలీవుడ్‌లో బిగ్‌ బ్రేక్‌ వచ్చేసింది. సరాసరి సల్మాన్‌ ఖాన్‌తో కలిసి నటించేసింది. భరత్‌లో ఆమె గ్లామర్‌ విందు ఎలా వుంటుందనే దానికి టీజర్‌లా ‘స్లో మోషన్‌’ సాంగ్‌ వీడియో రిలీజ్‌ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రీ షో ఇవ్వడానికే ఒళ్లు దాచుకోని దిషా పటాని బాలీవుడ్‌లో ఇంత భారీ చిత్రంలో అవకాశాన్ని అంత తేలిగా తీసుకుంటుందా ఏంటి? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన నడుము ఒంపులతో స్లో మోషన్‌ పాటతో కుర్రకారు గుండె స్పీడ్‌ మోషన్‌లో కొట్టేసుకునేట్టు చేసింది.

దిషా పటాని ఒక ఫోటో పెడితేనే మిలియన్ల కొద్దీ లైక్స్‌ వచ్చేస్తుంటాయి. ఇక పాట రిలీజ్‌ అయిందంటే ఎగబడి చూడకుండా వుంటారా? అందుకే స్లో మోషన్‌ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఒక్క రోజులోనే రెండు కోట్లకి పైగా వ్యూస్‌ తెచ్చుకున్న ఈ పాట భరత్‌ చిత్రానికి ఒక్కసారిగా హైప్‌ రెండింతలు చేసేసింది.

Rating: 5.0/5. From 1 vote.
Please wait...