మద్యం మత్తులో ఓ జంట బరితెగించింది. కిక్కులో ఏం చేస్తున్నారో అర్ధంకాని స్థితిలో.. ఏకంగా రోడ్డు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ముందే దుకాణం పెట్టేశారు. తాగిన మైకంలో ఈ ప్రపంచాన్ని మరిచి.. పోలీస్ స్టేషన్ ముందే శృంగారంలో మునిగి తేలారు. ఈ జంట పిచ్చి చేష్టలు చూసి షాక్ తిన్ని పోలీసులు.. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది ఈ ఘటన.

గ్యారీ హిల్, క్రిస్టల్ జంట ఫుల్లుగా మందుకొట్టింది. రోడ్డుపై నడుచుకుంటూ.. మద్యం మత్తులో తూగుతూ వచ్చారు. మందు కిక్కులో వారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. కిందపడుతూ.. లేస్తూ మెల్లిగా ఫ్లోరిడా పోలీస్ స్టేషన్ హెడ్‌క్వార్టర్స్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడికి రాగానే ఈ జంట చెలరేగిపోయింది. పోలీస్ స్టేషన్ ఉందని కూడా గమనించకుండా బరి తెగించారు.

పోలీస్ స్టేషన్ బయటే బట్టలు తీసేసి.. శృంగారంలో మునిగి తేలారు. ఈలోపు పోలీసులు స్టేషన్ నుంచి బయటకు రాగా.. ఈ సీన్ చూసి షాక్ తిన్నారు. ఇదేం అరాచకం రా బాబోయ్ అనుకుంటూ బెంబెలెత్తిపోయారు.. కాస్త తేరుకొని జంటను అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశంలో.. అందులోనూ ఓ పోలీస్ స్టేషన్ ముందు ఇలా బరితెగించినందుకు కేసు నమోదు చేశారు. యువతికి మందు కిక్కు మరీ ఎక్కువ కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

No votes yet.
Please wait...