ఏపీ సీఎం, టీడీపీ ఛైర్మన్ చంద్రబాబు నాయుడు… చెబుతున్నట్లు టీడీపీ అధికారంలోకి రావడం కష్టమేనా.. 150 సీట్లు వస్తాయంటూ చేస్తున్న ప్రకటనలు కార్యకర్తలను సంతృప్తి పరచడానికేనా.. అంటే తాజా పరిణామాలు చూస్తే అది నిజమే అనిపిస్తోంది.. ప్రధానంగా పోలింగ్ జరిగిన రోజు నుంచి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఆయనలో అభద్రత ను సూచిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే పోలింగ్ పైనా, ఈవీఎంల పైనా పదే పదే మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నాయి.

ప్రతిపక్షాల మాట సరే.. నిజంగా చంద్రబాబుకు 150 సీట్లు రావనే విషయం తెలిసిపోయిందా… ఆ విషయానికే వద్దాం… ఈవిఎంల పనితీరు పై భేషంటూ గతంలో మాట్లాడిన చంద్రబాబు.. ఈవీఎంల గొప్పతనంపై ప్రస్తుత బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు అప్పట్లో రాసిన ఓ పుస్తకానికి బాబు ముందు మాట కూడా రాశారు. కానీ ఇప్పుడు మాత్రం బ్యాలెట్టే ముద్దు ఈవీఎం వద్దంటూ నానాయాగీ చేస్తున్నారు. అలాగే ఈ వాదనను సమర్థించే పార్టీలను కూడగడుతున్నారు… వివి ప్యాట్ ల లెక్కింపుపై సుప్రీం కోర్టు మెట్లు ఎక్కనున్నారు.. అంతటితో ఆగకుండా మరో మెట్టు పైకెక్కి ఈవీఎం లను హ్యాక్ చేయోచ్చు… రష్యన్ హ్యాకర్లు హ్యాక్ చేస్తారంటూ చంద్రబాబు మొన్న మహారాష్ట్రలో ఓ ప్రకటన కూడా చేశారు.. మొన్నటి ఏపీ ఎన్నికల వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా రష్యన్ హాకర్లంటూ ఓ ప్రకటన చేశారు..

ఒక వేళ ఈవీఎంలే హ్యాకింగ్ అయితే 150 సీట్లు టీడీపీ వస్తాయా.. ఒక వేళ బాబు చెబుతున్నట్లు 150 గనుక టీడీపీకి వచ్చేటట్లుంటే ఈవీఎంల హ్యాకింగ్ జరగలేదని చెప్పాలా… ఇలా చంద్రబాబు ప్రకటనే పొంతన లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది.. ఒక వేళ రేపు ఓడిపోతే… ఈవీఎంల హ్యాకింగ్ వల్లే ఓడిపోయామంటూ చెప్పడానికి బాబు ముందు గానే రంగం సిద్దం చేసుకున్నారా అన్న చర్చ తాజా వాఖ్యలతో జరుగుతోంది..

Rating: 5.0/5. From 2 votes.
Please wait...