హైదరాబాద్‌ పహాడీ షరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలున్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు… లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హతమార్చారు. ఏ-ముస్తఫా ప్రాంతంలో కర్ణాటకకు చెందిన మహ్మద్‌ భాషా అనే వ్యక్తి తన నలుగురు సంతానంతో కలిసి నివాసముంటున్నాడు. అయితే.. భాషా ఏడేళ్ల కొడుకు యాసిన్‌.. రాత్రి స్థానికంగా వాటర్‌ట్యాంక్‌ వెనుకాల ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యాసిన్‌ హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రంజాన్‌ నెల సందర్భంగా పండ్లు తెస్తానని బయటికి వెళ్లిన కొడుకు శవమయ్యాడని భోరున విలపించారు.

రాత్రి వేళ షాపుకు వెళ్తుండగా గమనించిన దుండగులు..చెట్ల పొదల్లోకి లాక్కెల్లి లైంగిక దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. అనంతరం హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు…నిందితుల కోసం గాలిస్తున్నారు. బాలుడి హత్యతో స్థానికంగా విషాదం అలుమకుకుంది.

No votes yet.
Please wait...