అమెరికా అబ్బాయి.. ఆంధ్రా అమ్మాయి ఒక్కటయ్యారు. చిత్తూరుకు చెందిన అమ్మాయిని.. అమెరికా అబ్బాయి ఇష్టపడి.. హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాడు.. వేదమంత్రాల సాక్షిగా సంప్రదాయ బద్ధంగా ఆంధ్రా, అమెరికా జంట ఒక్కటైంది.

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన చిత్తూరుకు చెందిన శ్రీనిరీషా అక్కడే మిగిషాన్‌ యూనివర్శిటీలో చదువు పూర్తి చేసి.. వెంటనే ఉద్యోగంలో స్థిరపడింది. అక్కడ ఆమెతో పాటే పని చేసే అమెరికా పౌరుడు గ్రైనర్‌ ఇష్టపడ్డాడు. ఈ విషయం చిత్తూరులో ఉన్న తల్లిదండ్రులకు నిరీషా చెప్పాగా.. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరగాలని కోరారు. అందుకు వరుడు తల్లిదండ్రులు సరే అనడంతో హిందూ సంప్రదాయం ప్రకారం వారిద్దరికీ వివాహం జరిగింది.

Previous articleప్రేమజంటపై దాడి.. యువతిపై గ్యాంగ్‌ రేప్‌..
Next articleమహేష్.. ఆడపిల్లగా పుడితే ఒప్పుకొనే వరకు వెంటపడేవాడిని.