సెల్ఫీతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా గొరిల్లాలు..

0
499

ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్ స్టేటస్‌లుగా అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే సెల్ఫీలకు కేవలం మనుషులు మాత్రమే చక్కగా పోజులు ఇస్తారని భావిస్తే తప్పులో కాలేసినట్లే. ఇటీవల ఓ జూలో తీసిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సెల్ఫీలో ఉన్న గొరిల్లాలు సెన్సేషన్‌గా మారాయి.

కాంగోలోని విరుంగ నేషనల్ పార్కులో మౌంటెన్ గొరిల్లాలను సంరక్షిస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న మథియు శ్యామవు అనే రేంజర్ సరదాగా రెండు గొరిల్లాలతో సెల్ఫీ దిగాడు. సెల్ఫీ తీస్తుండగా ఫొటో కోసం చక్కగా పోజు ఇచ్చాయి గొరిల్లాలు. ఈ ఫొటోను ఎలైట్ యాంటీ పోచింగ్ యూనిట్స్ అండ్ కాంబట్ ట్రాకర్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ను 20వేలకు పైగా నెటిజన్లు షేర్ చేయడంతో పాటు లైకులు కొట్టడంతో వైరల్ అయింది.

కొందరేమో కుటుంబంతో తిరిగి కలిసినప్పుడు సంతోషం అని కామెంట్ చేస్తున్నారు. గొరిల్లాలు చాలా కూల్‌గా తమకు ఇలాంటి మామూలేనన్న తరహాలో సెల్ఫీకి పోజు ఇవ్వడాన్ని మెచ్చుకుంటున్నారు. సెల్ఫీ ఆఫ్ ద ఇయర్ అని ఆ సెల్ఫీకి క్రేజ్ తెచ్చారు.

అక్కడి రేంజర్స్ మాత్రం.. ఈ గొరిల్లాలు మనుషులు లేకపోతే అంత కూల్‌గా ఉండవని చెబుతున్నారు. మనుషులు తోడుగా లేకపోతే ఈ మౌంటెన్ గొరిల్లాలు ఒంటరితనంగా భావిస్తాయని, అసలే ప్రపంచ వ్యాప్తంగా ఇవి కేవలం 1000 వరకు ఉన్నాయని వీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

No votes yet.
Please wait...