మే 5న నీట్.. అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు ఇవే

0
360

మెడికల్ యూజీ ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్‌ను మే5న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ గత డిసెంబరులో విడుదల కాగా, జనవరి 31 వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఇక, దీనికోసం అన్ని సీబీఎస్ఈ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా MBBS, BDS కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 15 నుంచి అందుబాటులోకి ఉంచారు. పరీక్ష రోజు కూడా వీటిని అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకును సదుపాయం ఉంది. పరీక్ష రోజున మధ్యాహ్నం 12.30 నుంచి నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలు దాటితే అనుమతించరు.

గంట ముందే అభ్యర్థులకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచిస్తున్నారు. తప్పనిసరిగా హాల్ టిక్కెట్ ఉంటనే పరీక్షకు అనుమతిస్తారు. వీటితో పాటు గుర్తింపు కార్డును కూడా ఉంచుకోవాలి. ఓటరు ఐడీ, పాన్, ఆధార్ ఏదో ఒక గుర్తింపు కార్డును అభ్యర్థులు తమ వెంట తీసుకెళ్లాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కేవలం సాధారణ వస్త్రాలను మాత్రమే ధరించాలి. ఫుల్ హ్యాండ్స్ వేసుకుని వెళ్తే అనుమతించని పరిస్థితి ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అభరణాలు, తలలో పువ్వులు పెట్టుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. స్టేషనరీ కూడా అనుమతించరు. షూ వేసుకున్న విద్యార్థులను కూడా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు.

కళ్లద్దాలు (సన్ గ్లాసెస్), చేతి సంచులు, బెల్ట్, టోపీ తదితర వస్తువులను కూడా అనుమతించరు. ఉంగరం, చెవిపోగులు, ముక్కుపుడక, గొలుసు, నెక్లెస్, లాకెట్, బ్యాడ్జిలు, చేతి గడియారం, బ్రేస్‌లెట్, కెమెరాతో పాటు ఏ రకమైన లోహ వస్తువులు, తినుబండరాలు, నీళ్ల బాటిళ్లును కూడా అనుమతించరు. అభరణాలు, విలువైన పరికరాలను భద్రపరచుకోవడానికి పరీక్ష కేంద్రం వల్ల ఎలాంటి వసతులు కల్పిచరని అధికారులు వివరించారు. ముందుగా బుక్‌లెట్‌లో సూచనలు క్షుణ్ణంగా చదివిన తర్వాత ప్రశ్నాపత్రం తెరవాలి. ముందు తెలిసిన, సులువుగా ఉండే ప్రశ్నలకు సమాధానం రాయాలి. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. తర్వాత క్లిష్టమైన వాటికి సమాధానం రాయడానికి ప్రయత్నించాలి.

No votes yet.
Please wait...