బ్రతుకుతెరువు కోసమే సినిమాల్లోకి వచ్చాను: ‘డబ్బింగ్’ జానకి

0
260

తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ .. ఒరియా భాషల్లో జానకి విభిన్నమైన పాత్రలను పోషించారు. ఆమె ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలకి డబ్బింగ్ చెప్పేవారు. ఈ కారణంగానే అంతా ఆమెను ‘డబ్బింగ్ జానకి’గా పిలిచేవారు. ఒకవైపున డబ్బింగులు చెబుతూనే .. మరో వైపున సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఆమె, తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

“పదిహేను .. పదహారేళ్ల వయసులోనే నాకు పెళ్లైపోయింది. పెళ్లి అయిన తరువాతనే నేను సినిమాల్లోకి వచ్చాను. అంతకుముందు నాటకాలు వేసేదాన్ని .. ఆ తరువాతే సినిమాల్లోకి వచ్చాను. సినిమాల పట్ల ఆసక్తితో ‘పెద్దాపురం’ నుంచి చెన్నైకి వచ్చాను అనడం కంటే, బతుకుదెరువు కోసం వచ్చానంటేనే కరెక్ట్ గా ఉంటుంది. చెన్నైలో ఓ ఇంట్లో అద్దెకి ఉండేవాళ్లం. అప్పుడు నెలకి అద్దె 16 రూపాయలు. తమిళం నుంచి తెలుగులోకి వచ్చిన ఒక అనువాద చిత్రంలో తొలిసారిగా నాతో శ్రీశ్రీగారు డబ్బింగ్ చెప్పించారు. ఇక తెలుగులో నేను నటించిన తొలి చిత్రం ‘భూకైలాస్’ .. ఆ సినిమాలో జమునగారికి చెలికత్తెగా నటించాను” అని చెప్పుకొచ్చారు.

Rating: 5.0/5. From 2 votes.
Please wait...