ఇక నిరుద్యోగుల వంతు!.. కేసీఆర్‌కు చుక్క‌లే!

0
881

తెలంగాణ‌లో తిరుగులేని ఆధిక్యం సాధిస్తామ‌న్న ధీమాతో ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ అధినేత‌, ఆ రాష్ట్ర సీఎం కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు వ‌రుస దెబ్బ‌లు త‌గ‌ల‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. మొన్న‌టికి మొన్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ స‌మ‌స్య‌ల‌పై ఎంత‌మాత్రం ప‌ట్టింపు లేకుండానే సాగుతున్నార‌న్న క‌సితో కేసీఆర్ కూతురు క‌విత పోటీ చేసిన నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పెద్ద సంఖ్య‌లో రైతులు బ‌రిలోకి దిగారు. క‌విత‌ను ఓడించ‌డ‌మ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే… ప్ర‌భుత్వంపై త‌మ‌లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను చెప్పేందుకే రైతులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. పెద్ద సంఖ్య‌లో రైతులు బ‌రిలోకి దిగ‌డంతో నిజామాబాద్ ఎన్నిక‌లో చాలా విచిత్రాలు చోటుచేసుకున్నాయి.

ఆ ఎన్నిక పోలింగ్ ముగిసినా… ఇంకా ఫ‌లితాలు రాలేదు కాబ‌ట్టి రైతుల నామినేష‌న్ల ప్ర‌భావం ఎంత‌మేర ఉంటుంద‌న్న విష‌యం ఇప్పుడే తెలియ‌దు. అయితే ఇప్పుడు తెలంగాణ‌లో జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నిరుద్యోగులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే ఉద్యోగాల క‌ల్ప‌న సాధ్య‌మ‌ని ఉద్య‌మ నేత‌గా ఉన్న స‌మ‌యంలో కేసీఆర్ ప‌దే ప‌దే చెప్పారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అవ‌కాశాల‌న్నీ ఆంధ్రోళ్లే త‌న్నుకుపోతున్నార‌ని, ఫ‌లితంగా తెలంగాణ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు అంద‌డం లేద‌ని ఆయ‌న వాదించారు. ఫలితంగా నిరుద్యోగుల‌తో పాటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్య‌లో ఉద్య‌మంలోకి వ‌చ్చేశారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డ్డ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ ఉద్యోగాల క‌ల్ప‌న‌ను అట‌కెక్కించేశారు. రెండో ప‌ర్యాయం కూడా అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ ఉద్యోగాల క‌ల్ప‌న‌పై పెద్ద‌గా దృష్టి సారించ‌డం లేద‌నే చెప్పాలి.

Rating: 5.0/5. From 1 vote.
Please wait...