ఇంటర్ బోర్డు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

0
297

ఇంటర్ బోర్డులోని అవకతవకలపై హైకోర్టులో బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన పిటీషన్‌పై నేడు విచారణ జరిగింది. పిటీషనర్ తరుపు న్యాయవాది దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, 9.70 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రాశారన్నారు. తప్పుడు ఫలితాల కారణంగా 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇంటర్ బోర్డు అధికారులు స్పందించలేదన్నారు. 50 వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారని దామోదర్ రెడ్డి తెలిపారు.

ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం న్యాయ విచారణతో సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడింది. బోర్డులోని లోపాలను వివరించాలని కోరగా అడిషనల్ ఏజీ రామచంద్రరావు వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ వేశామని, ప్రతి ఏటా 25 వేల దరఖాస్తులు వస్తాయని, కానీ ఈ ఏడాది 9 వేల దరఖాస్తులే వచ్చాయని తెలిపారు. దీనిపై కలుగజేసుకున్న హైకోర్టు లెక్కలు ముఖ్యం కాదని, పరిష్కారం చెప్పాలని పేర్కొంది. సోమవారం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

No votes yet.
Please wait...